జగన్ కు సాయం చేసిన అక్షయ్ కుమార్…!

-

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు. 2019 లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ మంగళ్ భారీ విజయం సాధించింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించి జగన్ శక్తి తొలిసారిగా దర్శకుడుగా బాలివుడ్ కి పరిచయం అయ్యారు. ఇస్రో చేపట్టిన మిషన్ మంగళ్‌యాన్ ప్రయోగం ఆధారంగా దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించారు. అక్షయ్ కు జంటగా కరీనా కపూర్ నటించారు.

ఇంకా విద్యా బాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా దర్శకుడు జగన్ శక్తి తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లి అక్కడ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ముంబైలోని ఆసుపత్రిలో చేర్చగా.. ఆయనను పరీక్షించిన వైద్యులు మెదడులోని రక్తం గడ్డ కట్టిందని వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వెల్లడించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న అక్షయ్ కుమార్ వెంటనే స్పందించి దర్శకుడు జగన్‌ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరించడానికి ముందుకొచ్చారు. అక్షయ్ కుమార్ కేవలం డబ్బు సాయం మాత్రమే కాకుండా జగన్ కుటుంబసభ్యులకు అందుబాటులో ఉంటూ వారు బాగోగులు చూసుకోవాలని తన సిబ్బందికి చెప్పిన మాట తెలుసుకుని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్యం ఇప్పుడే కుదుట పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news