అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

-

గచ్చిబౌలి: అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకి కి చెందిన 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం ఫేక్ కరెన్సీల ముఠాల పై ఫోకస్ పెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠాను పట్టుకున్నామన్నారు.

ఈ ముఠా కిరాణా షాప్స్, పాన్ షాప్స్ లో ఫేక్ కరెన్సీ నీ మారుస్తున్నారని తెలిపారు సిపి. హైదరాబాద్, చెన్నై, కర్ణాటక కేంద్రంగా ఈ ఫేక్ కరెన్సీ రాకెట్ నడుస్తుందన్నారు. 1:3 నిష్పత్తి లో ఫేక్ కరెన్సీ ఇస్తున్నారని వివరించారు. ఒక లక్ష ఒరిజినల్ నోట్స్ కు 3 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తున్నారని తెలిపారు. పాత నేరస్తులపై నిఘా పెట్టి ఈ ముఠాను పట్టుకున్నామన్నారు సిపి స్టీఫెన్ రవీంద్ర.

రాజేష్, నిలేష్ అనే ప్రధాన నిందితులు సాయత్రం, రాత్రి వేళల్లో ఫేక్ నోట్స్ అమాయకుల దగ్గర సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి 30 లక్షల 68వేల 500 ఫేక్ నోట్స్, 60వేల 500 నగదు,13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ఈ నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news