ఐపీఎల్ 2023 లో అంతర్జాతీయ ఆటగాళ్లు దాదాపుగా బాగానే రాణిస్తున్నారు, ఏ ఒకరో ఇద్దరో మాత్రమే ఫామ్ లో లేక ఫ్రాంచైజీలను ఇబ్బంది పెడుతున్నారు. కాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఈ ఐపీఎల్ సీజన్ కు గానూ లక్నో సూపర్ జయింట్స్ తరపున బరిలోకి దిగి అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే ఆ జట్టుకు పిడుగులాంటి వార్త బాధపడేలా చేస్తోంది. ఈ మంత్ వరకు మాత్రమే వుడ్ జట్టుతో ఉండనున్నాడు, వచ్చే నెలలో జరగబోయే మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఇందుకు కారణం వుడ్ భార్య సారా రెండవసారి ప్రసవం కానుండగా దగ్గర ఉండడానికి వెళుతున్నాడు.
అయితే ప్రసవం అయ్యాక మళ్ళీ వస్తాడా లేదా అక్కడే ఉండిపోయి తన చిన్నారితో మిగిలిన రోజులు గడుపుతాడా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా వుడ్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో 11 వికెట్లు సాధించి దుమ్ములేపినా, ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేక బెంచ్ కే పరిమితం అయ్యాడు.