చిన్నచిన్న కారణాలు హత్యలకు కారణం అవుతున్నాయి. కుటుంబంలో చిన్న పాటి తగాదాలు హత్యలు, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మహరాష్ట్రలోని థానేలో జరిగింది. తనకు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ పెట్టలేదని ఓ మామ సొంత కోడలిని రివాల్వర్ తో కాల్చాడు.
పూర్తి వివరాాల్లోకి వెళితే… మహారాష్ట్ర థానే, రాబోడి పోలీస్ స్టేషన్ పరిధిలో సొంతమామ బ్రేక్ ఫాస్ట్ పెట్టలేదని తన కోడలి(42)పై కాల్పులు జరిపారు. కుడపులోకి బుల్లెట్ దూసుకెళ్లి సదరు మహిళ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం బాధిత మహిళ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)పై ఆయుధాల చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద నేరం నమోదు చేసినట్లు రాబోడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ ఘటేకర్ తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు ఇదే కారణమా..? మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు
.