కర్నూలు: కర్నూలు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సాయిబాబాగిరికి చెందిన చెన్నయ్యను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ యుగంధర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి శరీరంలో గుండె లేకపోవడంతో అందరూ షాక్ గురయ్యారు. దుండగులు హత్య చేసిన అనంతరం మృతుడి గుండెను తీసుకెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
చంపి, గుండెకాయ తీసుకెళ్లిపోయారు!
-