లవర్‌తో వెళ్లిపోయిన భార్య.. ముగ్గురు పిల్లలకు విషం తాగించి తానూ..

తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి విషం తాగాడు. తనతో పాటు ముగ్గురు పిల్లలకూ విషం తాగించాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు చనిపోయాడు. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో గురువారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పీహెచ్​ కాలనీకి చెందిన సమీయుల్లా అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల కింద భార్య సహీరా.. భర్త, తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రియుడితో సౌదీ అరేబియా వెళ్లిపోయింది. అక్కడ పనిమనిషి ఉద్యోగం చేస్తూ.. ప్రియుడితో ఎంజాయ్​ చేస్తూ భర్తకు వీడియో కాల్స్​ చేస్తుండేది. ఇంటికి రమ్మని భర్త ఎంత ఏడ్చినా, బతిమిలాడినా ఆమె మనసు కరగలేదు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీయులల్లా.. అమ్మ ఇక తిరిగి రాదని ముగ్గురు పిల్లలకు చెప్పి, విషం తాగించాడు. అనంతరం తానూ విషం తాగి చనిపోయాడు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని బెంగళూరు పోలీసులు తెలిపారు.