అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవదహనం

జార్ఖండ్ ధన్​బాద్​లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 400 మంది నివాసం ఉంటున్న 13 అంతస్తుల అపార్ట్​మెంట్​లో అకస్మాత్తుగా  మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే సజీవ దహమయ్యారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

fire-accident

జోడా పాఠక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్​మెంట్​లో ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది అపార్ట్​మెంట్ వాసులు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అపార్ట్​మెంట్​లో 400 మంది ఉంటున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. వెంటనే మంటలు ఆర్పే ప్రక్రియ ప్రారంభించాయి.