దివ్య హత్య కేసులో కొత్త కోణం..!

-

గజ్వేల్‌లో హత్యకు గురైన బ్యాంకు ఉద్యోగిని దివ్వ విషయంలో కొత్త సంగతులు వెలుగుచూస్తున్నాయి.గత మంగళవారం గజ్వేల్‌లో దివ్వ అనబడే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ ఉద్యోగిని దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు వెంకటేశ్‌ గౌడ్‌ అనే యువకుడు కారణం కావచ్చని అమ్మాయి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసారు. ఊహించినట్లుగానే ఆ హత్య ఆ అబ్బాయే చేసినట్లు పోలీసులు తేల్చారు. వెంకటేశ్‌ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసారు.

అయితే, ఈ హత్య కేసులో కొత్తకొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఇక్కడకు రాకముందు దివ్య కుటుంబం కూడా వేములవాడలోనే నివసించేదని, అక్కడే దివ్వ, వెంకటేశ్‌లు ఒకే స్కూల్‌లో చదువుకునేవారని తెలిసింది. చిన్నప్పటినుంచీ పరిచయం ఉండటం వల్ల వారిమధ్య సాన్నిహిత్యం పెరిగి, అది ప్రేమగా మారిందని, వారిద్దరూ చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వేములవాడలోని వారి స్నేహితులు చెబుతున్నారు.

కొంతకాలానికి వారి ప్రేమ విషయం రెండిళ్లలోనూ తెలిసేసరికి గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ జంట పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, తదనంతర పరిణామాల మధ్య ఈ కొత్త జంట పోలీసుల ముందుకు వచ్చింది. అయినా కూడా వారు తాము పెళ్లి చేసుకున్నట్లు పోలీసులకు, దివ్వ తల్లిదండ్రులకు కూడా తేల్చిచెప్పడంతో అందరూ ఇక వారిని వదిలేసారు.

అప్పటికే డిగ్రీలు అయిపోయిన వీరిద్దరూ బ్యాంకు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌లో కోచింగ్‌కు కూడా వెళ్లారు. అక్కడ ఒకే ఇంట్లో కలిసే ఉన్నారని కూడా తెలిసింది. వారిద్దరి కోచింగ్‌కు అయిన ఖర్చు కూడా వెంకటేశ్‌ తండ్రి పరశురాంగౌడ్‌ భరించినట్లు చెబుతున్నారు. ఎప్పుడైతే దివ్యకు బ్యాంకు ఉద్యోగం వచ్చిందో, అప్పటినుంచే ఆమెలో మార్పులు మొదలయ్యాయని, తన తల్లిదండ్రులు క్రమంగా ఆమెను తమ వైపుకు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారని వారి స్నేహితులు చెప్పారు. గజ్వేల్‌లో పోస్టింగ్‌ రాగానే, వెంకటేశ్‌ను వదిలేసి తన తల్లిదండ్రులతో అక్కడికి వెళ్లిపోయింది.

దాంతో వెంకటేశ్‌ పిచ్చివాడిలా తయారై, వేములవాడకు చేరుకున్నాడు. బ్యాకంకు ఉద్యోగం వచ్చిన తర్వాత దివ్యకు పెళ్లయినందన్న విషయం దాచి తల్లిదండ్రులు మళ్లీ ఓ సంబంధం ఖాయం చేసారు. దివ్య కూడా వెంకటేశ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంతో తీవ్రంగా హర్టయిన వెంకటేశ్‌ ఇటువంటి దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా, జరిగింది మరిచిపోయి, ఇద్దరి జీవితాలు బాగుచేసుకునే అవకాశం ఉన్నా కూడా ఇలాంటి ఉన్మాద చర్యలు ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉండటం బాధాకరం.

Read more RELATED
Recommended to you

Latest news