పూరి జగన్నాధ్ హీరోయిన్ ని సెట్ చేసుకున్నాడుగా …!

-

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి కలెక్షన్స్ ని సాధించారు. దాంతో ఇక గేర్ మార్చి మడి స్పీడ్ పెంచారు పూరి జగన్నాధ్. నందమూరి బాలకృష్ణ తో సినిమా అనుకున్నారు. ఆ తర్వాత రాం తోనే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అని అన్నారు. కాని అవన్ని గాలి వార్తలని చెక్ పెడుతూ విజయ్ దేవరకొండ సినిమాని అనౌన్స్ చేసి అందరికీ షాకిచారు. డియర్ కామ్రెడ్ తర్వాత బాగా డల్ అయిన విజయ్ కి పూరి జగన్నాధ్ సినిమా న్యూస్ బాగా కిక్ ఇచ్చింది.

 

అంతేకాదు ఆ సినిమా రిజల్ట్ గురించి ఎవరూ ఆలోచించకుండా ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు పెంచేసుకున్నారు. ఈ అంచనాల మధ్య పూరి జగన్నాధ్, చార్మీ నిర్మాతలుగా, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సహ నిర్మాతగా విజయ్ దేవరకొండ తో ఫైటర్ అన్న సినిమాని ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు పూరి జగన్నాధ్ టీం. అంతేకాదు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై షూటింగ్ జరుగుతున్నా కూడా హీరోయిన్ ఎవరన్న విషయం లో సస్పెన్స్ నెలకొంది. కియార అద్వాని, నిధీ అగర్వాల్, జాన్వీ కపూర్ అంటూ వార్తలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను బాగా వైరల్ అయింది. అయితే ఈ హీరోయిన్స్ అందరినీ పక్కన పడేసి పూరి జగన్నాధ్ తెరమీదకి వేరే బ్యూటీని తెచ్చాడు. ఆ అమ్మాయో అనన్యా పాండే. విజయ్ సరసన అధ్బుతంగా కనిపిస్తోంది. ఇక పూరి జగన్నాధ్ అంటే హీరోయిన్స్ ఇంకా అద్భుతంగా చూపిస్తాడని తెలిసిందే. అందుకే అనన్యా పాండే ని పరిచయం చేస్తూ మేకింగ్ పిక్ ని వదిలారు పూరి జగన్నాధ్ టీం. ఈ పిక్ అన్ని చోట్లా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news