ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసు లో కొత్త ట్విస్ట్

షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ముంబాయి లో డ్ర‌గ్స్ కేసు లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసు రోజుకు ఒక్క మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసు లో ముడుపులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న శామ్ డిసౌజా మ‌రో కీలక విష‌యాన్ని బ‌య‌ట పెట్టాడు.

ఎన్‌సీబీ అధికారులు క్రూయిజ్ నౌక పై దాడి చేసిన స‌మ‌యంలో ఆర్య‌న్ ఖాన్ ను విడిచి పెట్ట‌డానికి అక్క‌డ ఉన్న సాక్షి అయిన కిర‌ణ్ గోసాని డ‌బ్బులు తీసుకుంద‌ని తెలిపాడు. ఆర్య‌న్ ఖాన్ పై కేసు కాకుండా రూ. 50 ల‌క్ష‌లను షారుక్ మేనేజ‌ర్ పూజ డాడ్లిని ద‌గ్గ‌ర నుంచి కిర‌ణ్ గోసాని తీసుకున్నార‌ని తెలిపాడు. అయితే ఆర్య‌న్ ఖాన్ పై కేసు న‌మోదు కావ‌డం తో ఆ డ‌బ్బు తిరిగి ఇచ్చేశాడ‌ని అన్నాడు.

 

ఇప్ప‌టికే ఈ కేసు నుంచి ఆర్య‌న్ ఖాన్ ను త‌ప్పించ‌డానికి ఎన్‌సీబీ అధికారుల త‌రుఫున మ‌ధ్య వ‌ర్తులు రూ. 25 కోట్లు డిమాండ్ చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీని పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్య‌ప్తు బృందాన్ని కూడా వేసింది.