తెలంగాణ లో మద్యం అమ్మకాలు రోజు రోజు కు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ ల గరిష్టం గా రూ. 2,653.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది గత ఏడాది అక్టొబర్ తో పోలిస్తే చాలా ఎక్కువ. అంటే గత ఏడాది అక్టొబర్ లో దాదాపు రూ. 2,623 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది రూ. 30 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి.
అలాగే 2019 ఏడాది అక్టొబర్ తో పోలిస్తే దాదాపు రూ. 1000 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి. అయితే గతంలో కంటే ఈ ఏడాది బీర్ల అమ్మకాలు గణనీయం గా పెరిగాయి. గతంలో బీర్ల ధరలు అధికంగా ఉండటం తో వాటి అమ్మకాలు ఎక్కువ కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో బీర్ల పై ప్రభుత్వం ధరలు తగ్గించడం తో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టొబర్ లో 26.93 లక్షల బీర్లు అమ్మగా.. ఈ ఏడాది అక్టొబర్ లో 31.43 లక్షల బీర్లు అమ్మకాలు సాగాయి.