మందు తాగేందుకు పిలిచి మగ్గురిని చంపి తినేశాడు..

Join Our Community
follow manalokam on social media

ముందుగా అతను స్నేహితుడిగా పరిచయమవుతాడు. మాటిస్తే తీయనంతా నమ్మిస్తాడు. తన అదుపులోకి రాగానే అసలు రూపం బయటపెట్టి హతమారుస్తాడు. స్నేహితులను మందు తాగేందుకు తీసుకెళ్లి, వాళ్లను అక్కడ విచక్షణరహితంగా చంపి, వారి శరీర భాగాలను తింటున్న ఓ నర భక్షకుడికి జీవిత ఖైదు విధించడంతో మరి కొందరి ప్రాణాలు దక్కినట్లైయింది. రష్యా అర్ఖగెల్క్స్‌ పట్టణానికి చెందిన ఎడ్వర్డ్‌ సెవెజ్‌ నేవ్‌ (51), 2016 –2017 మధ్య కాలంలో మందుకని తీసుకెళ్లి ముగ్గురిని చంపి తినేశాడు. అవసరమైన శరీర భాగాలను తిన్న తర్వాత, ఓ ప్లాస్టిక్‌ కవర్లో భద్రపరుకుని, మిగిలిన మాంసాం, వ్యర్థాలను నదులు, లోయల్లో పారబోసేవాడు.

ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎడ్వర్డ్, తాను హత్యచేసిన ఒకరైన ఇంట్లోకి అద్దెకు దిగాడు. తన కొడుకు గురించి తల్లి దండ్రులు ప్రశ్నించగా పని కారణంగా వేరే పట్టణానికి మారిపోయాడని చెప్పుకొచ్చేవాడు. ఎన్నిసార్లు అడిగినా ఇదే సమాధానంతో పురమాయించేవాడు. ఈ క్రమంలో అదృశ్య కేసులో ఎంక్వైరీకి వచ్చిన పోలీసులకు కూడా ఏమాత్రం తడబడకుండా ఇదే అబద్ధం చెప్పి పంపించేవాడు.

అయితే మృతుల శరీర భాగాలు ఏమాత్రం గుర్తుపట్టకుండా ఉండటంతో పోలీసులకు కూడా నిందితులను గుర్తు పట్టేందుకు కష్టంగా మారింది. ఎడ్వర్డ్‌ గురించి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు గతంలో జంట హత్య కేసుల్లో 13 ఏళ్లు జైలు జీవితం గడిపాడని తెలుసుకున్నారు. అతనిపై అనుమానం వచ్చి తనదైన శైలిలో విచారించగా చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరు పరుచగా ఎడ్వర్డ్‌కు జీవిత ఖైదు విధిస్తు తీర్పు వెలువరించింది.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...