బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డంగా బుక్కయ్యాడు. గత రాత్రి జుమ్మెరాత్ బజార్‌లో రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని పెట్టేందుకు రాజాసింగ్, ఆయన అనుచరులు ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్కడ రాణి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అనుమతి లేదని.. పోలీసులు రాజాసింగ్‌ను, ఆయన అనుచరులను వారించారు. అయినా కూడా రాజాసింగ్ వినలేదు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.
వెంటనే రెచ్చిపోయిన ఆయన అనుచరులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అదే సమయంలో రాజాసింగ్ అక్కడే ఉన్న ఓ రాయితో తన తలపై కొట్టుకున్నాడు. దానికి సంబంధించిన ఫుటేజ్‌ను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.
కావాలని రాజాసింగ్ రాయితో కొట్టుకొని దాన్ని పోలీసులపై నెడుతున్నాడని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేశారు.
పోలీసులే తనను కొట్టారని.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ ఆరోపించిన సందర్భంగా పోలీసులు ఆ ఫుటేజ్‌ను మీడియాకు విడుదల చేశారు.
MLA Raja singh hit himself with a stone on his head and caused a self inflicted injury on his head and is falsely alleging that police has caused this injury.
DCP West Zone pic.twitter.com/jZv4bUK79A— A R SRINIVAS IPS (@DCPWZHyd) June 20, 2019
#Hyderabad
Lone BJP MLA @TigerRajaSingh was injured when he was allegedly attacked by @hydcitypolice, while trying install a new statue of Rani Avanti Bai Lodhi at Jumerat Bazar. @THHyderabad@BJP4India@BJPSocial@CPHydCity @TelanganaDGP @the_hindu pic.twitter.com/GPtdf5gu4H— Abhinay Deshpande|అభినయ్ देशपांडे (@AbhinayTheHindu) June 20, 2019