పుణేలో దారుణం.. పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం

ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణే సిటీలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికపై ఒకరు పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. పుణే పోలీసులకు బాధితురాలు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. భొసారి పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 ఏళ్ల బాలికపై యువకులు అత్యాచారం చేశారు. పలు మార్లు అత్యాచారం చేసిన తర్వాత సదరు యువతి గర్భవతి అని తెలుసుకుని వారు ఆమెను అబార్షన్ మాత్రలు మింగాలని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే బొప్పాయి పండు తినాలని అత్యాచారం చేసిన సదరు వ్యక్తి సోదరి బలవంతం పెట్టినట్లు బాధితురాలు తెలిపింది.

crime-in-telangana

కొన్ని నెలల కిందటనే దత్తు పూజారి పదిహేనేళ్ల బాలిక పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో అక్కడే అత్యాచారం చేశాడని పోలీసు అధికారి పేర్కొన్నాడు. కంప్లయింట్‌లో ఈ మేరకు బాధితురాలు పేర్కొన్నట్లు చెప్పాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు దత్తుపూజారి, అతడి సోదరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తనను మొదట చెంపపైన కొట్టారని, ఆ తర్వాత బెల్టులతో కొట్టి ఓ గదిలో బంధించారని తెలిపింది. చాలా సార్లు బెల్టుతో కొట్టడం వల్ల తను స్పృహ కోల్పోయానని, అయినా తనను వదిలపెట్టలేదని చెప్పింది. తనను నోట్లో గుడ్డలు కుక్కి మరీ రేప్ చేశారని వివరించింది. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి పూజారి చాలా సార్లు తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. తాను గర్భవతినని తెలియగానే, పూజారి భయపడిపోయాడని, తన సోదరి చేత అబార్షన్ మాత్రలు తనకు పంపాడని పేర్కొంది. పూజారి సోదరి తనను బొప్పాయి పండు తినాలని బలవంతం చేసిందని వివరించింది బాధితురాలు.