కరోనా: రోజుకి కోటి వ్యాక్సిన్ల టార్గెట్.. డిసెంబర్ అంతానికి ఇండియా పూర్తి చేయగలుగుతుందా? 

-

సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని కరోనా వ్యాక్సినేషన్ల వేగాన్ని బాగా పెంచారు. ఆ ఒక్కరోజే సుమారు 2.5కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయబడ్డాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్లో వేగం కనబడింది. దీంతో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. ఐతే ఆ వ్యాక్సినేషన్ల వేగం అలాగే ఉందా అన్నది పరిశీలిస్తే వివరాలిలా ఉన్నాయి.

శుక్రవారం పెరిగిన వ్యాక్సిన్లతో ఆ వారం పూర్తి సగటు విపరీతంగా పెరిగింది. సగటున ఆ వారం మొత్తంలో 9.3మిలియన్లుగా ఉంది. అదే ఆ తర్వాత సోమవారం నాడు చూసుకుంటే సగటు 7.5మిలియన్లుగా ఉంది. గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఈ సగటు సాధారణ స్థితికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పెద్దలందరికీ 817మిలియన్ల డోసులు ఇవ్వబడ్డాయి. అందులో 207మిలియన్ల మందికి రెండు డోసుకు పూర్తవ్వగా, 400మిలియన్ల వారికి మొదటి డోసు పడింది.

ఈ సంవత్సరం అంతానికి మొత్తం అర్హులైన పెద్దలకు అంటే 940మిలియన్లకు పైగా జనాభాకు వ్యాక్సిన్ వేస్తామని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన ఇప్పటి వరకు అయిన వ్యాక్సినేషన్ ని చూసుకుంటే, ఇకపై రోజుకి 10.4మిలియన్ల డోసులు వేయాల్సి ఉంది. మోదీ పుట్టిన రోజు తర్వాత రోజు రోజుకీ డోసుల సంఖ్య తగ్గుతుండడం చూస్తుంటే డిసెంబర్ ఉనాటికి అర్హులైన పెద్ద వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ పూర్తవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news