ఏపీలో దారుణం..ఐదేళ్ల చిన్నారి పై తండ్రి అత్యాచారం.!

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఐదేళ్ల కూతురు పై అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్ తో పాటు మరో ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఈ ఏడాది జూన్ 26న నిందితుడు కామం తో కళ్ళు మూసుకుని తన ఐదేళ్ల కూతురిపైనే దారుణానికి పాల్పడ్డాడు. ఆ విషయం తన భార్యకు తెలియడం తో ఇంటి నుండి పారిపోయాడు.

అత్యాచారం
అత్యాచారం

అయితే తాజాగా మళ్లీ ఇంటికి వచ్చి పాప ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో చిన్నారి అమ్మమ్మ అడ్డుకుంది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దాంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన పై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.