సికింద్రాబాద్ ఘటన.. ఇద్దరి ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

-

సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆరు అంతస్తుల భవనంలో కింద కార్ల విడి భాగాల గోదాం, పైన స్పోర్ట్స్‌ షోరూం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో గోదాంలో షార్ట్ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పైఅంతస్తులో ఉన్న షోరూంకు అంటుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి.

భవనం నలువైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటి వరకు బిల్డింగులో చిక్కుకున్న ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. మరో ఇద్దరు ఆచూకీ గల్లంతైనట్లు అక్కడున్న వాళ్లు అనుమానిస్తున్నారు. వారి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం మూడు వైపుల నుంచి 20 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.

భవనంలో ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు ఉండటం వల్ల మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. వాటి వల్ల త్వరగా వ్యాప్తి చెంది.. ఆర్పడం కష్టతరంగా మారిందని తెలిపారు. తీవ్రమైన పొగ వల్ల ఇద్దరు రెస్క్యూ సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news