ధమాకా ఎఫెక్ట్.. మాస్ మహారాజ ‘మిరపకాయ్’ సినిమా రీ రిలీజ్

-

ప్రస్తుతం అంతా టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఎలా మొదలైందో ఈ ఆలోచన గానీ.. కొన్ని సినిమాలు అవి రిలీజ్ అయినప్పుడు ఎంత కలెక్షన్స్ చేశాయో కానీ.. రీ రిలీజ్ లో మాత్రం సూపర్ వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఎంటర్ అయ్యాడు.

ధమాకాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన రవితేజను చూసి ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అంతే కాదు గతంలో రవితేజతో కలిసి సినిమాలు తీసిన వాళ్లు.. వాటిలో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న సినిమాల రికార్డ్స్ బయటకు తీస్తున్నారు. వాటిని మళ్లీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మాస్ మహారాజ రవితేజ నటించిన మిరపకాయ్ మూవీని కూడా రీ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రవితేజ హీరోగా హరీశ్​ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్​, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు.

జనవరి 12వ తేదీ 2011వ సంవత్సరంలో సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా అప్పట్లో మిగతా అన్ని సినిమాలతో పోటీపడి సంక్రాంతి విన్నర్​గా నిలిచింది. రవితేజ సరసన రీచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. నాగబాబు, అజయ్, బ్రహ్మాజీ, రావు రమేశ్​, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు ఇతర కీలకపాత్రల్లో నటించారు. అ

ప్పట్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్​గా నిలవడమే కాదు.. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అప్పట్లో 114 కేంద్రాల్లో 50 రోజులపాటు విజయవంతంగా నడిచిన ఈ సినిమాను జనవరి 26వ తేదీన రీ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆ రోజున రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మిరపకాయ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద రమేష్ పుప్పాల నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news