Shocking: హోలీ జోష్, మద్యం మత్తు ఏం చేస్తున్నాడో తెలియలేదు… కత్తితో తనకుతాను గుండెలపై పొడుచుకుని మృతి

-

దేశం మొత్తం హెలీ వేడుకల్లో మునిగితేలింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా హోలీ వేడుకలు పెద్దగా జరగలేదు. ఈసారి మాత్రం కరోనా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ హోలీ వేడుకల్లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి హోలీ వేడకల్లో భాగంగా మద్యంతాగా మత్తులో తనను తాను గుండెల్లో కత్తితో పొడుచుకున్నారు. హోలీ వేడుకల్లో భాగంగా ఇండోర్ లోని బాన్ గంగా కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున ఈఘటన జరిగింది.

హోలీ వేడుకల్లో భాగంగా డ్యాన్స్ చేస్తున్న సమయంలో తన చేతిలో ఉన్న కత్తితో గుండెల్లో నాలుగుసార్లు పొడుచుకున్నాడు. ఇదంతా సదరు వ్యక్తి మద్యం మత్తులో చేసుకున్నాడు. మృతుడు గోపాల్ సోలంకి (38) టైలర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్థరాత్రి కుష్వా నగర్ ప్రాంతంలో హోలికా దహన్ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి మొదటి భార్య నుంచి విడిపోయాడు. మరొక మహిళతో నివసిస్తున్నాడు. సంఘటన జరిగే సమయంలో అతనితో సహజీవనం చేస్తున్న మహిళ కూడా అక్కడే ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news