తండ్రిని చంపి… క్రైం షో ని ఎలా వాడుకున్నాడు అంటే…?

క్రైమ్ షో నుండి ప్రేరణ పొందిన మైనర్ బాలుడు 2020 మేలో తన తండ్రిని చంపాడని, మృతదేహాన్ని పారేసి… సాక్ష్యాలను ధ్వంసం చేశాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనోజ్ మిశ్రా అనే బాధితుడిని అతని కొడుకు ఇనుప రాడ్ తో కొట్టాడు అని… ఆ తర్వాత కత్తి మీద వెలి ముద్రలు పడకుండా ఉండటానికి ఒక గుడ్డ ముక్క సహాయంతో కత్తి పట్టుకుని గొంతు కోసి చంపాడు అని…

crime
crime

ఆ తరువాత బాలుడు తన తల్లి సంగీత మిశ్రా సహాయం తీసుకొని తన స్కూటీ మీద మృతదేహాన్ని వైష్ణో ధామ్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్ళి కాల్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆత్మహత్యగా హత్యను దాటవేయడానికి ప్రయత్నించాడని మరియు బాధితుడి వస్తువులను అతని కళ్ళజోడు, చెప్పులు వంటివి మృతదేహం పక్కన ఉంచాడు అని వివరించారు. పోలీసులు తరచూ మైనర్ నిందితుడిని… అతని తల్లిని నెలల తరబడి ప్రశ్నించినా సరే సాక్ష్యాలు దొరకలేదు అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అతని ఫోన్ చూడగా అందులో క్రైం వీడియోలకు సంబంధించిన రికార్డ్ ల ఆధారంగా గుర్తించామని తెలిపారు.