స్వాతంత్య్రం వచ్చిన ఎనిమిది దశాబ్దాల తరువాత కూడా, జార్ఖండ్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ మూఢనమ్మకాల పట్టు నుండి విముక్తి పొందలేదు. ఒక భయంకరమైన సంఘటన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒక మగపిల్లాడిని పొందాలనే కోరికలో బాబా (చేతబడి చేసేవాడి) ఆదేశాల మేరకు ఒక వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తెను గొంతు కోసి చంపాడు. జార్ఖండ్ లోని రాంచీలోని లోహర్ దగాలోని పెష్రార్ బ్లాక్ లో ఈ సంఘటన జరిగింది.
26 ఏళ్ల నిందితుడు సుమన్ నెగాసియా కూలీగా పనిచేస్తున్నాడు. కొడుకు పుట్టాలి అంటే కూతురుని చంపాలి అని ఓజా అనే ఒక బాబా సలహా ఇచ్చాడు. పెష్రార్ పోలీసులు సుమన్‌ను అరెస్టు చేయగా, బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించారు. ఓజాను పట్టుకోవటానికి వేట ప్రారంభించామని తదుపరి దర్యాప్తు జరుగుతోంది అని పోలీసులు చెప్పారు.