డిసెంబర్ నాటికి 100 మిలియన్ డోస్ ల కరోనా వ్యాక్సిన్ ఇండియాకు…!

ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే టీకా డ్రైవ్ కోసం డిసెంబర్ నాటికి 100 మిలియన్ మోతాదులను అందించే అవకాశం ఉంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ అనే కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది.

ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మన దేశంలో మూడో దశ ట్రయల్స్ లో ఉంది. కనీసం బిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సమర్థవంతమైన ఫలితాలను చూపిస్తే మాత్రం డిసెంబరు నాటికి సీరం కి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనవల్లా అన్నారు.