రాహుల్ గాంధీ మీద అమెరికా మాజీ అధ్యక్ష్యుడు ఒబామా తన పుస్తకంలో కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒబామా మీద కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే ఒబామా రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ అధికారికంగా స్పందించకపోయినా కొందరు నేతలు ఒబామా మీద ఫైర్ అయినట్లు సమాచారం. రాహుల్ గాంధీ ఆటిట్యూడ్ సరిగాలేదని ఒబామా తాను ఇటీవల రాసి విడుదల చేసిన పుస్తకంలో ప్రస్తావించారు. అయితే ఒబామా అభిప్రాయాలతో ఏ ఒక్క భారతీయుడు ఏకీభవించని కొత్తగా తెలంగాణకు ఇన్చార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు.
ఇక సీనియర్ కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా కూడా ఆ కామెంట్స్ అసలు ఏం పట్టించుకోమని పేర్కొన్నారు. ఇక అంతర్గతంగా కూడా ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒబామా అనవసరంగా రాహుల్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. అయితే ఈ విషయం మీద ఎటువంటి ప్రకటనలు చేయవద్దని అలా చేస్తే దీని గురించి మరింత జనాల్లోకి చొచ్చుకు వెళ్ళే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం సూచనలు చేసినట్లు చెబుతున్నారు. సో దీని గురించి ఎక్కడా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపించడం లేదు.