అనుమానంతో భార్య మీద యాసిడ్ పోసేసాడు…!

అనుమానం పెనుభూతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుమానం ఉన్న వ్యక్తులు ఏది అయిన చేయడానికి వెనుకడుగు వేయరు. తాజాగా ఒక భర్త భార్య మీద అనుమానంతో యాసిడ్ పోసాడు. విశాఖ జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ దాడి చేస్తుండగా అడ్డుగా వచ్చిన కూతురుపై కూడా యాసిడ్ పడింది. భార్య, కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

కేజీహెచ్  తరలించిన పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాత్రూం లో వాడే యాసిడ్ కావడంతో పెద్ద ప్రమాదం కాలేదని వైద్యులు అంటున్నారు. ఎం పి పి ఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ నుంచి కూడా వివరాలు సేకరిస్తారు.