బిహార్‌లో విషాదం.. విద్యుత్ తీగ‌లు త‌గిలి ముగ్గురు జ‌వాన్లు మృతి

బిహార్ రాష్ట్రంలోని సుపౌల్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగ‌లు త‌గిలి ముగ్గురు జ‌వాన్లు మృతి చెందారు. అంతే కాకుండా మ‌రో తొమ్మిది మంది జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో నలుగురి ప‌రిస్థితి విషమంగా ఉంది. కాగ బిహార్ లోని సుపౌల్ ప్రాంతంలో స‌శ‌స్త్ర సీమాబ‌ల్ 45బ ఈ బెటాలియ‌న్ కు చెందిన‌ జ‌వాన్లు త‌మ నివాసానికి టెంట్లు వేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెల‌స్తుంది. టెంట్లు వేస్తుండ‌గా పైన ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ తీగ‌లు త‌గిలాయి.

దీంతో ముగ్గురు మ‌ర‌ణించారు. మ‌రో తొమ్మిది మంది తీవ్రం గాయప‌డ్డారని అధికారులు తెలిపారు. గాయప‌డ్డ జ‌వాన్లను ఎల్ఎన్ స‌బ్ డివిజ‌న‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు అధికారులు తెలిపారు. అలాగే విషమంగా ఉన్న న‌లుగురు జ‌వాన్లను ద‌ర్భంగా మెడిక‌ల్ క‌ళాశాల‌కు త‌ర‌లించిన‌ట్టు తెలిపారు. కాగ విర్పుర్ ప్ర‌ధాన కేంద్రంగా 45 బీ బెటాలియ‌న్ జ‌వాన్లు ప‌ని చేస్తున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. కాగ ఇక్క‌డ జ‌వాన్లుకు శిక్ష‌ణ జ‌రుగుతుంద‌ని తెలిపారు.