వదినతో అక్రమ సంబంధం..సంగారెడ్డిలో ముగ్గురు ఆత్మహత్య !

వదినతో అక్రమ సంబంధంతో కారణంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరులో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరులో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

వాసుదేవ అనే 27 సంవత్సరాల వ్యక్తి, రేఖా అనే 28 సంవత్సరాల మహిళ, సోనం రెండు సంవత్సరాల పాప ఆత్మహత్య చేసుకున్నారు. రేఖ అనే మహిళ వాసుదేవ వాళ్ళ అన్న భార్య. అంటే వాసుదేవకు వదిన. అసలు ఏం అయిందో తెలియదు కానీ.. గురు వారం ఉదయం పూట ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

రేఖ, వాసుదేవ మధ్య అక్రమ సంబంధం కారణంగానే ఈ సంఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనను స్థలానికి చేరుకున్న భానుర్ పోలీసులు…. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.