రైల్వే ట్రాక్స్‌పై కూర్చుని ప‌బ్‌జి ఆడారు.. మృత్యువు బాట ప‌ట్టారు..!

-

మ‌హారాష్ట్ర‌లోని హింగోళీ ప్రాంతానికి చెందిన న‌గేష్ గోరె (24), స్వ‌ప్నిల్ అన్నపూర్ణె (22)లు ట్రాక్‌ల‌పై కూర్చుని గేమ్ ఆడ‌డం మొద‌లు పెట్టారు. లు ప్ర‌మాదంలో వారి శ‌రీరాలు చిద్ర‌మై ట్రాక్‌ల చుట్టూ ప‌డిపోయాయి.

చిన్నారులు, యువ‌త ఇప్పుడు జ‌పిస్తున్న ఒకే మాట‌.. ప‌బ్‌జి మొబైల్‌.. ఆ గేమ్‌లో లీన‌మైపోయి త‌మ చుట్టు ప‌క్క‌ల ఏం జ‌రుగుతుందో కూడా వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే అలాంటి స్థితిలో చాలా మందికి అనుకోని ప్ర‌మాదాలు ఎదుర‌వుతున్నాయి. ప‌బ్‌జి అడిక్ష‌న్ వ‌ల్ల ఇప్ప‌టికే అనేక మంది అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ అడిక్ష‌న్ ఇప్పుడు రెండు నిండు ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

మ‌హారాష్ట్ర‌లోని హింగోళీ ప్రాంతానికి చెందిన న‌గేష్ గోరె (24), స్వ‌ప్నిల్ అన్నపూర్ణె (22)లు ప‌బ్‌జీ మొబైల్ గేమ్ ఆడుతూ త‌మ గ్రామానికి స‌మీపంలో ఉన్న ఖ‌ట్కాలీ బైపాస్ ద‌గ్గ‌ర ఉన్న‌ రైల్వే ట్రాక్‌ల మీద‌కు చేరుకున్నారు. అనంత‌రం ట్రాక్‌ల‌పై కూర్చుని గేమ్ ఆడ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో వారు గేమ్‌లో పూర్తిగా లీన‌మ‌వ్వ‌గా.. అటుగా వ‌చ్చిన హైద‌రాబాద్‌, అజ్మీర్ ట్రెయిన్ వారి మీద‌కు దూసుకెళ్లింది. దీంతో వారు ప్రాణాల‌ను కోల్పోయారు. రైలు ప్ర‌మాదంలో వారి శ‌రీరాలు చిద్ర‌మై ట్రాక్‌ల చుట్టూ ప‌డిపోయాయి.

అయితే న‌గేష్‌, స్వ‌ప్నిల్ లు కూర్చున్న రైల్వే ట్రాక్ ప్రాంతం ప‌గ‌లే నిర్మానుష్యంగా ఉంటుంది. దీంతో వారిని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. ఈ క్ర‌మంలో చీక‌టి కాగా అటుగా వ‌చ్చిన కొంద‌రు వారి మృత‌దేహాల‌ను చూసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఏది ఏమైనా.. ప‌బ్‌జి మొబైల్ గేమ్ అనేది ఒక వ్య‌సనంగా మారింద‌న‌డానికి ఈ ఘ‌ట‌నే ఒక నిద‌ర్శ‌నం. ఇక‌నైనా ఈ విష‌యం దిశ‌గా ప్ర‌భుత్వాలు చ‌ర్యలు తీసుకుంటే మంచిది. లేదంటే ముందు ముందు మ‌రిన్ని అన‌ర్థాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Latest news