రచ్చకీడుస్తున్న రష్మిక ముద్దు..!

కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత తెలుగులో ఛలో, గీతా గోవిందం, దేవదాస్ సినిమాల్లో నటించింది రష్మిక మందన్న. మూడు సినిమాలతోనే తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండకు హాట్ పెయిర్ అయ్యింది. గీతా గోవిందం సినిమాలో వారిద్దరి జంట అదరగొట్టింది.


మరోసారి ఈ ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నారు.ఆదివారం ఉదయం ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు. స్టూడెంట్ లీడర్ గా విజయ్ ఓ చిన్న ఫైట్ తో పాటుగా రష్మికతో ఘాడ ముద్దు లాగించేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఒకేసారి ఈ టీజర్ రిలీజైంది. అయితే ఈ సినిమా టీజర్ పై కన్నడ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. రష్మికకు కన్నడలో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రక్షిత్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రష్మిక విజయ్ తో ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఆ హీరో ఫ్యాన్స్ కు నచ్చట్లేదు.
డియర్ కామ్రేడ్ టీజర్ లో వారి ముద్దు సీనే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ సీన్ పై నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు కన్నడ ఫ్యాన్స్. విజయ్ తో ఎఫైర్ ఉండబట్టే రక్షిత్ తో పెళ్లికి రష్మిక నో చెప్పిందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిపై రక్షిత్ కాని.. రష్మిక కాని ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.