ప్రియుడుతో సన్నిహితంగా ఉన్న వీడియో లీక్ చేసారని, 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య…!

-

గుజరాత్ అహ్మదాబాద్ లోని చరణగర్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక చేసుకున్న ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రియుడు సన్నిహితంగా ఉన్న వీడియోను లీక్ చేయడంతో ఆమె ఆత్మహత్యా చేసుకుంది. డిప్రెషన్ కారణంగా సోమవారం సాయంత్రం ఆమె ఇంటి పైకప్పుకి ఉరి వేసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఆమె ప్రియుడు తన సన్నిహిత వీడియోను తన ముగ్గురు స్నేహితులకు లీక్ చేసాడు.

అది మరింత వైరల్ అయింది. ఫిబ్రవరి 29 న, బాలిక తల్లిదండ్రులు తన ప్రియుడిపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసారు. “ఈ వీడియో లీక్ కావడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైంది అని… సోమవారం సాయంత్రం ఆమె మరింత ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుందని సర్దార్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ హేమంత్ పటేల్ అన్నారు. “ప్రియుడిపై అత్యాచారం కేసులో ఐపిసి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లైంగిక నేరాల (పోక్సో) చట్టం కింద కేసు నమోదైంది.

వీడియోను ప్రసారం చేసినందుకు అతని ముగ్గురు మిత్రులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అభియోగాలు మోపారు. నలుగురు నిందితులలో ముగ్గురిని అరెస్టు చేశారు.” అని ఆయన వివరించారు. ఈ ఘటన ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. డీజీపీ ఈ ఘటన మీద నివేదిక కూడా అడిగినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news