టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని అంటున్నాయి మీడియా వర్గాలు. గత కొంత కాలంగా ఫాం లో లేక కోహ్లీ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటన కోహ్లీకి చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. ఆ పర్యటనలో కోహ్లీ ఒక్క సెంచరి కూడా నమోదు చేయలేదు. దానికి తోడు కోహ్లీ సారధ్యం పై కూడా పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనవసరంగా కొంత మందిని కోహ్లీ ఎక్కువ నమ్మి యువకులను పక్కన పెడుతున్నాడని అంటున్నారు. జట్టులో బూమ్రా ఒకప్పుడు కీలక బౌలర్ గాని ఇప్పుడు కాదని అతని వలన పెద్దగా ఉపయోగం లేదని, అతన్ని తప్పించి కొంత మంది యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అనే సలహాలు కోహ్లీ కి ఎక్కువగా ఇస్తున్నారు. దానికి తోడు కొంత మందిని మార్చాలి అనే సలహాలు కూడా వస్తున్నాయి.
దీనిపై ఇప్పుడు కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని అంటున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పర్యటన కోసం టీం ఇండియా సిద్దమవుతుంది. ఈ పర్యటనలో టీం విజయం సాధించాలి. ఈ సీరీస్ టీం ఇండియాకు కీలకం. అందుకే కోహ్లీ ఎవరిని మార్చాలి ఎవరిని తుది జట్టులో ఉంచాలి అనే దానిపై ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాడని ప్రచార౦ జరుగుతుంది. మరి దీనిని కోహ్లీ ఏ విధంగా అధిగమిస్తాడు అనేది చూడాలి. రేపు టీం ఇండియా సఫారి జట్టు తో తొలి మ్యాచ్ ఆడుతుంది.