భ‌ర్త‌పై భార్య యాసిడ్ దాడి

Join Our COmmunity

వివాహేతర సంబంధం ఓ కుటుంబ‌లో క‌ల‌క‌లం రేపింది. అనుమానం పెనుభూత‌మైంది. తనను కాదని మరొకరితో సంబంధం కొన‌సాగిస్తున్నాడ‌న్న అనుమానంతో భార్య భర్త పై యాసిడ్ పోసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగుచూసింది.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస‌నగర్‌కు చెందిన నరసింహారావు (50), లక్ష్మీ భార్యభర్తలు. అయితే, నరసింహారావు వేరే వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న అనుమానంతో లక్ష్మీ నిలదీసేది. కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం ఆ గొడవ కాస్తా ముదిరింది. భర్తపై ఆగ్ర‌హంతో భార్య లక్ష్మీ ఇంట్లో నుంచి యాసిడ్ తీసుకొచ్చి మొహం మీద పోసింది. అది కాస్తా కంటిలో పడడంతో నరసింహారావు ఆ మంట తట్టుకోలేక బయటకు పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు ఆయనను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు విషయం పై ఆరా తీస్తున్నారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news