పుట్టేది ఏ బిడ్డో తెలుసుకోవడానికి భార్య కడుపుని కొడవలితో కోసాడు…!

దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు పుట్టేది మగ బిడ్డా లేక ఆడ బిడ్డా అనేది తెలుసుకోవడానికి ఒక మూర్ఖుడు కొడవలితో భార్య కడుపుని కోసాడు. భార్య కడుపును కొడవలితో కోసి… ఆమెను తీవ్ర అనారోగ్యానికి గురిచేసి, వారి పుట్టబోయే పసికందు మరణానికి కారణమైన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

crime
crime

సదరు మహిళ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌ లో చికిత్స తీసుకుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుడాన్‌ కి చెందిన వ్యక్తిగా పోలీసులు వివరించారు. లింగాన్ని తెలుసుకోవడానికి అతను ఇలా చేసాడని, ఈ దంపతులకు అప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారని మహిళ సోదరుడు చెప్పాడు. భారత్ లో మగ బిడ్డను పరువురుగా భావిస్తూ ఉంటారు. ఇదే అన్ని అనర్ధాలకు కారణంగా మారుతుంది.