ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏపీలో హిందూ దేవాలయాలు వర్సెస్ జగన్ ప్రభుత్వం అన్నట్టు దాడులు జరుగుతున్నయి. ఇలాంటి తరుణంలో బీజేపీ పెట్టిన అన్ని బిల్స్ కి మద్దతిచ్చి మంచి మార్కులు కొట్టేసింది వైసీపీ. అయితే ఈ క్రమంలో వైసీపీ మంత్రి కొడాలి నాని దాడులు కూడా పెద్ద విషయం ఏమీ కాదన్నట్టు చేసిన కామెంట్స్ రచ్చ రేపుతున్నాయి. ఈ సమయంలో ముందస్తు సమాచారం లేకుండా వైఎస్ జగన్ ఆకస్మిక పర్యటనకి వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరనున్న సీఎం జగన్, 6 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ రాత్రికి ప్రధాన మంత్రి మోడి తో సమావేశం కానున్నారని తెలుస్తోంది. వీలైతే, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే అమరావతి లాండ్ స్కాం మీద వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో రచ్చ చేస్తన్నారు. ఫైబర్ గ్రిడ్ అంశాన్ని కూడా వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కూడా ప్రధానిని కలిసి రాజధాని భూముల అక్రమాలపై సీబీఐ విచారణ కోరే అవకాశముంది. ఇక రేపు మళ్ళీ గన్నవరం రానున్న జగన్, అటు నుండి తిరుమలకు వెళ్లనున్నారు.