గాలి జనార్ధన్ రెడ్డి : మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. తిరుప కనీసం అక్రమ మైనింగ్ తో పాటు ప్రభుత్వానికి రాయాల్టి, ఇతర పనులు చెల్లించలేదనే ఆరోపణలపై… కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం.
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి దాఖలు చేసిన వ్యక్తిగత క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను విచారిస్తుంది. జనార్ధన్ రెడ్డి.. ప్రభుత్వ అనుమతి లేకుండా వేల మెట్రిక్ ఇనుప ఖనిజాన్ని విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా గాలి జనార్దన్ రెడ్డి గతంలో మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.