BREAKING : మరోసారి రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం

-

 

BREAKING : మరోసారి రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ లమధ్య విభేదాలు ప్రమాద దశకు చేరాయి. మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్ధి, బిజేపి నేత వసుంధర రాజే పై ఉన్న అవినీతి ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శిస్తూ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం రోజు ఆసాంతం నిరహార దీక్ష కు దిగారు సచిన్ పైలట్.

మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి గెహ్లాట్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, విఫలమయ్యారు సచిన్ పైలట్. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితిని వివరించారు రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ సుఖిందర్ రణధావా. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని, రాష్ట్ర పార్టీలో ఐక్యత ను పునరుద్ధరించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నాయకులు ఇచ్చే సమాచారం ఆధారం చేసుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభిప్రాయానికి వచ్చింది. ఏ సమయంలో, ఎలాంటి దిద్దుబాటు చర్యలు, నిర్ణయాలు అనేది పలు అంశాల ఆధారంగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news