ఏపీలో జగన్ నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వ జాడల్లోనే నడుస్తోంది. ఎలా అయితే గత ప్రభుత్వం అన్ని పధకాలకు చంద్రన్న పేర్లు పెట్టారో ఈ ప్రభుత్వం కూడా అన్ని పధకాలకు, జగనన్న, రాజన్న, వైఎస్సార్ అనే పేర్లు తగిలిస్తోంది. తాజాగా ఏపీలో పంటల భీమాకు వైఎస్సార్ పేరు పెట్టారు. ఉచిత పంటల భీమా పథకానికి వైఎస్సార్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బ్రతికి ఉండగా రైతులకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ చేసిన సేవలకు గానూ ఈ పంటల భీమా పథకానికి వైఎస్సార్ పేరు పెడుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019-20 సంవత్సరంలో రబీ సీజన్ అలాగే 2020 ఖరీఫ్ పంటకు అమలు అయ్యేలా పంటల భీమా పథకం వర్తింప చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో ఈ ఉచిత పంటల భీమా పధకం అమలు కానుంది.