తెలంగాణ రైతులకు శుభవార్త… రూ.75 లోపు పంట రుణాలు మాఫీ

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు ఎదురు చూస్తున్న పంటల రుణ మాఫీ పై కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. . తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు 2022-23 బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు. రూ.2 లక్షల 56 వేల 958 కోట్ల 51 లక్షలతో 2022 -23 తెలంగాణ బడ్జెట్‌ ను మంత్రి హరీష్‌ రావు ప్రవేశ పెట్టారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్‌ రావు పంటల రుణ మాఫీపై ప్రకటన చేశారు. రూ.75 లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు. అలాగే.. దళిత బంధు కోసం 17700 కోట్లు, ఎస్టీ సంక్షేమం 12 వేల 565 కోట్లు, బీసీ సంక్షేమం 5 వేల 698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 177 కోట్లు, కల్యాణ లక్ష్మీ, శది ముబారక్ లకు 2 వేల 750 కోట్లు, ఆసరా పింఛన్లకు 11 వేల 728 కోట్లు, డబల్ బెడ్రూం ఇళ్లకు 12 వేల కోట్లు బడ్జెట్ లో పెడుతున్నట్లు ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news