నురగ కక్కుకుని కాకులు, కుక్కలు మృతి…!

-

కరోనా వైరస్ ఏమో గాని ఇప్పుడు ఏది జరిగినా సరే జనాలు మాత్రం భయపడిపోతున్నారు. అది మనుషులకు మాత్రమే పరిమితం అయింది అనుకున్నా జంతువులకు కూడా రావడం ఇప్పుడు కంగారు పెడుతుంది. రోజు రోజుకి దాని తీవ్రత పెరగడం అవి.. జంతువులకు కూడా వ్యాపించి చనిపోవడం జరుగుతుంది. పులులు సింహాలు, పిల్లలకు కాకులకు కరోనా సోకడం ఇప్పుడు భయపడుతుంది.

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఒక సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్‌లో గురువారం మూడు కుక్కలు, 50 కాకులు మృతి చెందాయని అధికారులు పేర్కొన్నారు. కరోనా తీవ్రత ఎకువగా ఉన్న సమయంలో ఇలా కాకులు చనిపోవడం భయపెడుతుంది జనాలను. అసలు ఎం జరుగుతుందో అర్ధం కాక అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు.

చనిపోయిన కాకులను గుర్తించిన ప్రజలు వాటిని పక్కన పడేయడానికి కూడా ముందుకి రాలేదు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పశుసంవర్ధక అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి చేరుకుని కుక్కలు, కాకుల కళేబరాల నుంచి నమూనాలను సేకరించి పరిక్షలకు తరలించారు. అవి నురగ కక్కుకుని చనిపోవడం వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news