సీఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్‌ విడుదల!

-

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్తే! కొవిడ్‌ విజృంభణ నుంచి కోలుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రతిరోజు ఏదో ఒక నోటిఫికేషన్‌ విడుదలవుతూనే ఉంది. ఆర్మీ విభాగంలో కూడా నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. ఇక ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ విషయానికి వస్తే.. ఈ పోస్టులకు 2021 జూన్‌ 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్‌ 29 చివరి తేదీ.

సీఆర్‌పీఎఫ్‌

భర్తీకి సంబంధించిన ఖాళీల వివరాలు తెలుసుకుందాం. మొత్తం 25 ఖాళీలున్నాయి. అన్‌ రిజర్వ్‌డ్‌–13, ఈడబ్ల్యూఎస్‌–2, ఓబీసీ–6, ఎస్సీ–3, ఎస్టీ–1 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు రూ.1,77,000 వరకు వేతనం లభిస్తుంది.

 

విద్యార్హతల వివరాలు చూస్తే సివిల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పాస్‌ కావాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు ఏజ్‌ రిలాక్సేషన్‌ ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్‌ డౌన్‌లోడ్‌ చేసి, నోటిఫికేషన్‌ లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పోస్టులో పంపాలి. లేదా నేరుగా ఆ అడ్రస్‌కు వెళ్లి కూడా దరఖాస్తులు అందించవచ్చు. అప్లికేషన్‌ ధర పోస్టల్‌ ఆర్డర్‌ లేదా బ్యాంక్‌ డ్రాఫ్ట్‌ రూపంలో రూ.400 చెల్లించాలి. పోస్టల్‌ ఆర్డర్‌ లేదా బ్యాంక్‌ డ్రాఫ్ట్‌ తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్‌: DIG, Group Centre, CRPF, Rampur, District & Rampur, U.P.&244901. . అర్హత ఉన్న అభ్యర్థులను ఫిజికల్‌ స్టాండర్డ్, ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news