యోగా మా దేశంలోనే పుట్టింది… నేపాల్ ప్రధాని ఓలి.

-

2015 నుండి ప్రతీ ఏడాది జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితికి వినతి పత్రం అందించారు. అప్పటి నుండి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐతే తాజాగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, యోగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. యోగా నేపాల్ లోనే పుట్టిందని, ప్రపంచానికి యోగా పరిచయం చేసింది నేపాలే అని, యోగా పుట్టినపుడు ఇండియా అనే దేశమే లేదని, అది రాష్టాలుగా విభజించబడి ఉందని కామెంట్లు చేసారు.

ఈ విషయంలో భారతదేశ చరిత్రకారులు తప్పుడు అభిప్రాయాన్ని ప్రచారం చేసారని, నిజం వాళ్ళకి తెలిసినా కూడా తప్పుడు సమాచారాన్ని బయటకు వెల్లడి చేసారని, యోగాకి నేపాలే ఇల్లు అని, అన్నాడు. దీంతో ఓలి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు వినబడుతున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news