ఏపీ సీఎంఓలో కీలక మార్పులు ?

ఏపీలో కీలక పొజిషన్ లో ఉన్న ఐఏఎస్ లకు స్థానచలనం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీ సీఎంలోకి కొత్తగా ఒకరిద్దరు ఐఏఎస్ ను తీసుకునే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అలాగే వీటితో పాటు కొన్ని జిల్లాలకి కలెక్టర్లని కూడా స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో లో ఏపీ కేడర్ కి కొత్త ఐఏఎస్ లను అను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ఇప్పుడు వీరి సేవలను ఉపయోగించు కోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అదీ గాక ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో అనుభవం ఉన్న ఐఏఎస్ లకు అయితే ఈ పరిణామాలన్నీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకూ దారి తీస్తుంది అనేది తెలియాల్సి ఉంది.