హృతిక్ రోషన్ పై కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు..ఇంటికి పిలిచి..!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇప్పడు వివాదాల క్వీన్‌గా మారింది..రోజుకొక సంచలన ప్రటకన,ట్విట్లతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది బాలీవుడ్ బామ..ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీ పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది..తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు మరో షాక్ తగిలింది..ఇప్పటికే పోలీసు కేసులతో సతమతమవుతున్న కంగనపై బాలీవుడ్ సీనియర్ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేశారు.. హృతిక్ రోషన్ వ్యవహారంలో తనను ఇరికిస్తూ కంగన తనపై నిరాధార ఆరోపణలు చేసిందని పేర్కొంటూ అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జావేద్ అక్తర్ ఓ కేసు వేశారు.. చట్ట ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.
హృతిక్ రోషన్ కుటుంబంతో కుమ్మక్కై జావేద్ అక్తర్ తనను ఇంటికి పిలిచి బెదిరించారని, హృతిక్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారని కొద్ది రోజుల క్రితం కంగన ఆరోపించింది.. సినీ పరిశ్రమలో రాకేష్ రోషన్ పెద్ద మనిషని, అతనితో పెట్టుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని జావేద్ అన్నట్టు కంగన తెలిపింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కంగనపై జావేద్ తాజాగా కోర్టుకెక్కారు. ఇదిలా ఉండగా, ముంబైలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై కంగన, ఆమె సోదరి రంగోలికి ముంబైలోని బాంద్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.