బ్రేకింగ్ : ఏపీలో కీలక అధికారుల బదిలీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపిలో ఆరుగురు అఖిల భారత సర్వీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంవి. శేషగిరిబాబుని ఐజి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు బదిలీ చేసింది. అలాగే సిద్ధార్థ జైన్ ను సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ గా బదిలీ చేసింది. ఐ.ఆర్.టి.ఎస్ అధికారి కె. రవీంద్ర కుమార్ రెడ్డిని ఏపిఐఐసి వైస్ చైర్మన్, యండిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఆర్ఎస్ అధికారి ఎం. రమణారెడ్డిని ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవో గా బదిలీ, కాన్సెప్ట్ సిటీస్ సీఈవో గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఐఆర్ఎస్ అధికారి సిహెచ్. రాయ్ ఈశ్వరరెడ్డి ని ఎండి ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేసింది. ఐడిఈఎస్ అధికారి సూర బాలకృష్ణ  డిప్యుటేషన్ పూర్తవడంతో పేరెంట్ క్యాడర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఐఆర్ఎస్ అధికారి ఎస్.బి.ఆర్. కుమార్ లక్కింశెట్టి ని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ గా బదిలీలు చేస్తూ ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జరీ చేసారు.