హత్రాస్ కేసు నిందితులను సిబిఐ పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు…!

-

ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జైలులో ఉన్న హత్రస్ కేసు నలుగురు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల బృందం పాలిగ్రాఫ్ మరియు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష కోసం గుజరాత్ లోని గాంధీనగర్ కు తీసుకుని వెళ్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హత్రాస్ కేసుపై సిబిఐ దర్యాప్తుకు సిఫారసు చేసింది.Family feud behind Hathras horror? One accused jailed in 2001 for attacking  rape victim's grandfather - India News

గత నెలలో అంటే అక్టోబర్ లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టింది. ఉత్తర ప్రదేశ్‌ లోని హత్రాస్‌ లోని బూల్‌గారి గ్రామంలో నివసిస్తున్న బాలిక సెప్టెంబర్ 29 న ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్ ఆసుపత్రిలో మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితులను సెప్టెంబర్ 26 న అరెస్ట్ చేసారు. వారిని అరెస్ట్ చేసిన మూడు రోజులకు బాధితురాలు మరణించింది.

Read more RELATED
Recommended to you

Latest news