సోయా పాలు, కొబ్బరి పాలతో పెరుగు.. గేదె పెరుగుకంటే..ఎన్నోరెట్లు మంచిదట..!

-

కొందరికి పెరుగు అసలు నచ్చదు. మరికొందరికి పెరుగుతో ఫినిషింగ్ ఇవ్వకపోతే భోజనం చేసిన అనుభూతి ఉండదు. పెరుగు ఆరోగ్యానికి హానికరం అని కొందరు అనుకుంటే..మరికొందరు పెరుగు చాలా మంచిది అంటుంటారు. అసలు పెరుగు ఆరోగ్యానికి మంచిదా కదా..పెరుగు నచ్చకుంటే..ప్రత్యామ్యాయం ఏంటో ఈరోజు చూద్దాం.

పెరుగు ఆరోగ్యానికి, రక్షణ వ్యవస్థకు చాలా మంచిది. పాల వల్ల వచ్చే లాభాల కంటే..మన శరీరానికి పెరుగు వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే భోజనానంతరం ఒక కప్పు పెరుగు తినాలని ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పుడు చెప్తుంటారు. ఉప్పు లేని లోటు లేకుండా ఉం‍డాలంటే..వంటల్లో ఉప్పుకు బదులు పెరుగును వేసుకోవచ్చు. సలాడ్స్ కి పెరుగు చట్నీతో తినొచ్చు.

ఇంత అవగాహన కల్పించినప్పుటికీ..పెరుగు అంటే కొందరికి అసలు ఇష్టం ఉండదు. తినరు కూడా. మరికొంతమంది..పూర్తిగా శాఖాహార ప్రొడెక్ట్స్ తినాలని..ఆఖరికి పాలను, పాలనుంచి వచ్చే పెరుగును దూరం పెడతారు. మరికొంతమందికి అదేంటో..పాల ఉత్పత్తులను ఏం తిన్నా..అలర్జీలు వస్తాయి. డాక్టర్లు కూడా మిల్క్ ప్రొడెక్ట్స్ అన్నీ మానేయమంటారు. ఆ లోపం భర్తీ చేయడానికి టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. మరి అలాంటి వారికి పెరుగు మిస్స్ అయినట్లే కదా..ఇష్టం లేక పక్కన పెట్టినవారి సంగతి వదిలేద్దాం..పాపం పెరుగును ఇష్టపడేవాళ్లు..కొన్ని కారణాల చేత దూరం పెట్టాల్సిన పరిస్థితి వస్తే..వారికి పెరుగును అందించటానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అదే సోయా పెరుగు, కొబ్బరి పెరుగు. ఈ రెండు రకాల పెరుగులను ఇళ్లలో తయారు చేసుకుంటే..గేదెపాలు, ఆవుపాలు పెరుగు కంటే..ఎంతో చవక, మరి ఎంతో లాభం ఉంటుంది. అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

సోయా పెరుగును తయారు చేసుకునే విధానం:

సోయా గింజల్లో హై ప్రోటీన్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అనేక పోషకాలను అందిస్తాయి. ఈ విషయం కూడా అందరికే తెలిసింది. ఇలాంటి సోయగింజలను 12 గంటలు నానపెట్టి ఆ తర్వాత క్లీన్ చేసి మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి బాగా గ్రైండ్ చేయాలి. అప్పుడు పాలు వస్తాయి. ఆ పాలను మరిగించండి. నార్మల్ పాలను తోడుపెట్టినట్లు ఈ పాలను కూడా తోడుపెట్టండి. 100 గ్రాముల సోయా చిక్కుడు గింజలు తీసుకుంటే ప్యామిలీ మొత్తనికి సరిపడా పెరుగువస్తుంది.

100 గ్రాముల సోయాపెరుగులో ఉండే పోషకాలు:

ఒక కప్పు సోయాపెరుగు మనం తిన్నామంటే..66కాలరీల శక్తి వస్తుంది. గేదెపాల పెరుగు కంటే..7-8 రెట్లు ఎక్కువ.
కార్పోహైడ్రేట్స్ 3 గ్రాములు
ప్రోటీన్ 3 గ్రాములు
కొవ్వు 2 గ్రాములు

సోయా పెరుగులో ఉండే ప్రయోజనాలు ఏంటంటే:

ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా డవలప్ అవుతాయి
బీపీ తగ్గించడానికి, రక్తనాళాలను స్మూత్ చేయడానికి, బ్లడ్ వెజల్స్, ఆట్రీస్ రెండింటిని డైల్యూట్ చేసి స్మూత్ అవుతుందట..దీని వల్ల బీపీ బాగా కంట్రోల్ అవుతుందని 2006వ సంవత్సరంలో విక్టోరియా యూనివర్శిటీ ఆస్ట్రేలియా వారు పరిశోధన చేసి నిరూపించారు.
2015 వ సంవత్సరంలో జపాన్ వారు బ్రస్ట్ క్యాన్సర్ మీద పరిశోధన చేసారు. 5043మందిని తీసుకుని 3నెలల పాటు ఒక కప్పు సోయా పెరుగు ఇచ్చారు. బ్రస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 20శాతం తగ్గించాయట. పిల్లలలతో సహా ‌ఎ‌వరైనా తినొచ్చు.

కొబ్బరి పెరుగు తయారు చేసుకునే విధానం:

కొబ్బరి పాలు ఎలా చేయాలో అందరికి తెలుసు. మనం ఇది పులావ్ కి, స్పెషల్ కర్రీకి వాడుతాం. అలాంటి పాలను కాగపెట్టి.. గోరవెచ్చని పాలలో తోడు పెట్టండి.

100గ్రాముల కొబ్బరి పెరుగులో ఉండే పోషకాలు:

శక్తి 157క్యాలరీలు
పిండిపదార్థాలు 20 గ్రాములు
మాంసకృతులు1 గ్రాము
కొవ్వులు 9 గ్రాములు
ఇందులో ఉన్న మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించటానికి గుండె ఆరోగ్యానికి బాగా మంచిదట. కొబ్బరి పెరుగు గుండెకు మరీ మంచిదని సెంటిఫిక్ గా నిరూపించబడింది.

కాబట్టి ఎవరికైతే గేదెపెరుగును తినటానికి సమస్యలు ఉన్నాయో అలాంటి వారు..ఈ రెండు రకాల పెరుగును ట్రై చేయండి. ఆరోగ్యంతో పాటు..టేస్టీగా పెరుగును ఎంజాయ్ చేయొచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news