గుజరాత్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఘన విజయం

-

ఐపీఎల్‌ సీజన్‌ 2022 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని రీతిలో జట్లు ఆటను కనబరుస్తూ.. ఆకర్షిస్తున్నాయి. అయితే 5 వరుస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ బ్రేక్‌ ఇచ్చింది. శిఖర్‌ ధవన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్‌) అర్ధశతకంతో పాటు రబాడ (4/33) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో టైటాన్స్‌పై విజయం సాధించింది. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది పంజాబ్‌.

IPL 2022, GT vs PBKS Highlights: Shikhar Dhawan, Kagiso Rabada Shine As  Punjab Kings Coast Past Gujarat Titans | Cricket News

తొలుత గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 143/8 స్కోరు చేయగా.. సుదర్శన్‌ (50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్‌ 16 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసి నెగ్గడం విశేషం. రాజపక్స (28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), లివింగ్‌స్టోన్‌ (10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 నాటౌట్‌) ధాటిగా ఆడారు. రబాడ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news