జిమ్ అండ్ వెల్‌నెస్ స్టార్టప్ క్యూర్.ఫిట్ 800 మంది సిబ్బందిని తొలగించింది. దేశవ్యాప్తంగా ఆ కంపెనీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను పర్మినెంట్‌గా తీసేశారు. లాక్‌డౌన్ కారణంగా ఫిట్‌నెస్ సెంటర్లు మూసి ఉండడంతో కాస్ట్‌ను కట్ చేసుకునేందుకు క్యూర్.ఫిట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ స్టార్టప్‌ను 2016లో అప్పటి మాజీ ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు ప్రారంభించారు. ఇందుకు సింగపూర్‌కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ అనే కంపెనీ పెట్టుబడి పెట్టింది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వస్తున్న నష్టాలను భర్తీ చేసుకునేందుకు క్యూర్.ఫిట్ ఉద్యోగులను తొలగించింది.
కాగా క్యూర్.ఫిట్ ప్రారంభమైన అనతికాలంలోనే పాపులర్ అయింది. ఈ కంపెనీకి పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా ఉన్నారు. అంతేకాదు.. ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులచే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ గ్రూప్ ఫిట్‌నెస్ సెషన్లను ఇందులో అందిస్తారు. దేశవ్యాప్తంగా 130 ప్రాంతాల్లో క్యూర్.ఫిట్ సేవలు అందిస్తోంది.
క్యూర్.ఫిట్‌కు దేశం మొత్తం మీద 5వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో ప్రస్తుతం 800 మందిని తీసేశారు. అయితే ముందు ముందు పరిస్థితులు మెరుగుపడితే వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుందని.. ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.