మాంసం కూరలో కరెన్సీ నోట్లు.. ఇదెక్కడి ఇసిత్రం!

-

ఎవరమైనా మనదగ్గర కరెన్సీ నోట్లు ఉంటే ఎక్కడ పెట్టుకుంటాం? పర్సులోనో, పర్సులోపెట్టి జేబులోనో పెట్టుకుంటాం. లేదంటే చేతి సంచిలోనో, చెక్కుడు సంచిలోనో పెట్టుకుంటాం. కానీ ఓ మహానుబావుడు మాత్రం కరెన్సీ నోట్లను మాంసం కర్రీలో పెట్టుకున్నాడు. తూ.. వీడెక్కడి తిక్కలోడూ అనుకుంటున్నారా? వాడు తిక్కలోడు కాదండీ.. దొంగోడు. కరెన్సీని దొంగచాటుగా తీసుకెళ్లడం కోసం.. తెలివిగా కూరలో కుక్కేశాడు.

మురాద్‌ ఆలం అనే ఓ ప్రయాణికుడు బుధవారం సాయంత్రం దుబాయ్‌ వెళ్లడం కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అతడి వాలకం అనుమానాస్పదంగా కనిపించడంతో చెక్‌చేసిన ఎయిర్‌పోర్టు సిబ్బందికి.. దిమ్మతిరిగే దృశ్యాలు కనిపించాయి. అతని బ్యాగులోని బఠానీ గింజలో ప్యాకెట్లో కరెన్సీ నోట్లే, బిస్కెట్‌ ప్యాకెట్లలో కరెన్సీ నోట్లే, ఇతర తినుబండారాల పొట్లాట్లో కరెన్సీ నోట్లే, ఆఖరికి వండుకుని ప్యాక్‌చేసిన మాంసం కూరలో కూడా కరెన్సీ నోట్లే.

అసలు సంగతేందంటే ఈ కరెన్సీ నోట్లన్నీ ఏ ఒక్క దేశానికి సంబంధించినవో కావు. వాటిలో కొన్ని సౌదీ రియాల్‌లు, కొన్ని ఖతార్‌ రియాల్‌లు, మరికొన్ని కువైట్‌ దీనార్లు, ఇంకొన్ని ఒమనీ రియాల్‌లు, చివరికి యూరోలు.. ఇలా అన్ని దేశాల కరెన్సీ నోట్లు కలిపి మన ఇండియన్‌ కరెన్సీలో రూ.45 లక్షలున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది.. కరెన్సీతోపాటు నిందితుడు మురాద్‌ ఆలంను కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news