మహబూబాబాద్: ఆపరేషన్ కోసం దాచిన డబ్బు చిత్తు కాగితాల్ల కనిపించాయి. ముక్కలు, ముక్కలు చినిగి చిందరవదగా పడి ఉన్నాయి. దీంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు. లబోదిబో అంటూ గుండెలు బాదుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్‌లోని ఇందిరానగర్ కాలనీలో జరిగింది.
తోపుడు బండిపై కూరగాయాలు అమ్ముకునే భూక్యా రెడ్యా.. తన కడుపులో ఏర్పడిన కణితి ఆపరేషన్ కోసం రూ. 2 లక్షలు అప్పుచేశాడు. ఈ డబ్బులతో పాటు కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బు రూ. 50 వేలను తన పూరింట్లోని చెక్క బీరువాలో దాచారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో డబ్బును పరిశీలించేందుకు భూక్యా రెడ్యా బీరువా తెరిచి చూశాడు. ఒక్కసారిగా ఆయన షాక్‌కు గురయ్యాడు. డబ్బులన్నీ ముక్కలు, ముక్కలుగా చినిగిపోయి కనిపించాయి. 500, 100 నోట్లను ఎలుకలు కొరికి పాడు చేశాడు. దీంతో బాధితుడు కన్నీరుమున్నీరయ్యారు. చినిగిన నోట్లను చూసి బ్యాంకు అధికారులు అవి పనికిరావు అని చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు సాయం చేయాలని కోరుతున్నారు