ఇండియా పోస్ట్ తాజాగా కొత్త సర్వీసులని తీసుకు రానుంది. పన్ను చెల్లించేవారికి ఈ సేవల వలన మరెంత ప్రయోజనకరంగా ఉంటుంది. పన్ను చెల్లించేవారు ప్రతీ సంవత్సరం ఐటీఆర్ దాఖలు ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళ కోసం ఇండియా పోస్ట్ ఈ సేవలని మొదలు పెట్టడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే..
ఇక నుండి ఐటీఆర్ దాఖలు చెయ్యడానికి ఇబ్బంది పడక్కర్లేదు. సమీప పోస్టాఫీసు సేవా కేంద్రాల్లో (సీఎస్‌సీ) ఐటీఆర్ దాఖలు చేసే అవకాశాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా పోస్ట్ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.
పన్ను చెల్లించే వాళ్ళకి ఇది కాస్త సులభంగా ఉంటుంది. మీ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన సమస్య కూడా లేదు. సమీప పోస్టాఫీసు సీఎస్‌సీ కౌంటర్లో ఆదాయపు పన్ను రిటర్నులను ఎంతో ఈజీ ఫైల్ చెయ్యచ్చు.
తపాలా, బ్యాంకింగ్, బీమా సేవలు వంటి వివిధ ఆర్థిక సేవల కోసం దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ సీఎస్‌సీ కౌంటర్లు పనిచేస్తాయి.
వీటి వలన అనేక ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఆన్‌లైన్‌లో రిటర్నులు దాఖలు చేసుకోగలిగేవారు కొత్త ఆదాయపు పన్ను వెబ్‌సైట్ www.incometax.gov.in లో లాగిన్ అయ్యి ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చు.